వంశీ ‘నక్షత్రం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Posted October 8, 2016

   ram charan release nakshatram movie first look

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్-రెజీనా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘నక్షత్రం’. ఈ యాక్షన్ థ్రిల్లర్ సాయిధరమ్‌ తేజ్‌ పోలీస్ అధికారిగా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారు. ఇప్పటికే సందీప్ కిషన్, రెజీనా పోలీస్ డ్రెస్ లో ఉన్న పిక్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘నక్షత్రం’ ఫస్ట్‌లుక్‌ బావుందంటూ.. మొత్తం యూనిట్‌ సభ్యులకు అభినందనలు తెలిపారు చెర్రీ. ఇక, దర్శకుడు కృష్ణవంశీ నక్షత్రం ఫస్ట్ లుక్ ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. వంశీ స్టయిల్ లో తెరకెక్కుతోన్న చిత్రం కావడం.. పైగా సినిమాలో మెగా టచ్ కూడా ఉండటంతో వంశీ నక్షత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇదిలావుండగా, ఈ చిత్రం తర్వాత కృష్ణవంశీ బాలయ్యని ‘రైతు’గా చూపించబోతున్నారు. డిసెంబర్ లో ‘రైతు’ సెట్స్ పైకి తీసుకెళ్లేందు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

SHARE