ఆ స్టార్ దెబ్బకి చరణ్ షేక్..

Posted April 7, 2017

ram charan shooting troubles from sun in rajahmundry
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆ స్టార్ చుక్కలు చూయిస్తున్నాడు.ఆ స్టార్ దెబ్బకి ప్లేస్ మారిపోదామని చూస్తున్నాడు.చరణ్ ని అంతలా ఇబ్బంది పెడుతోంది మనందరికీ భగవత్ స్వరూపమైన సూర్యుడు.గ్రహాలన్నీ ఈయన చుట్టూ తిరుగుతున్నా సూర్యుడు నక్షత్రమే అని సైన్స్ చెపుతోంది.ఇంతకీ సూరీడుకి,చరణ్ కి సుకుమార్ షూటింగ్ లో లడాయి అయింది.ముందుగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి లో అనుకున్నారు.అయితే అనుకోని ఇబ్బందులతో ప్లాన్ మారింది. షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జరిగింది.రాజమండ్రి పరిసరాల్లో వేసవి ఎండలకు చిత్ర యూనిట్ కి చుక్కలు కనిపిస్తున్నాయట.చరణ్ కూడా ఎండ దెబ్బకి షేక్ అవుతున్నాడంట.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పోలి ఎక్కువ పచ్చదనం,కాస్త చల్లదనం వుండే ప్రాంతం ఏదైనా దొరికితే అక్కడికి షూటింగ్ షిఫ్ట్ చేద్దామని కూడా యూనిట్ ప్లాన్ చేస్తోందట. దీనికి ఎండతో పాటు ఇంకో సమస్య తలెత్తడమే.ఎండ కారణంగా అనుకున్న పని అనుకున్నట్టు జరగడం లేదట.దీనివల్ల షెడ్యూల్ లో తేడా వస్తే డేట్స్ ఇతరత్రా ఇబ్బందులు రావొచ్చని యూనిట్ డౌట్ పడుతోందట.

SHARE