చిరు వల్లే చెర్రీ లేట్..

 Posted October 25, 2016

ram charan sukumar movie going to sets slow because chiranjeevi
చిత్రపరిశ్రమలో మారుతున్న పరిణామాలకు మరో ఉదాహరణ ఇది.ఒకప్పుడు హీరోల కోసం సాంకేతిక నిపుణులు ఆగాల్సివచ్చేది.ఇప్పుడు సాంకేతిక నిపుణుల కోసం స్టార్ డం ఉన్న కథానాయకులు కూడా ఆగాల్సి వస్తోంది.మెగా పవర్ స్టార్ రాంచరణ్,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓ నెల ఆలస్యం కావడానికి ఇదే కారణమైంది.

cameraman rathnaveluఆ సినిమాకి కెమెరా మెన్ గా పరమహంస అనుకున్నప్పటికీ సుకుమార్ తనకి అలవాటైన రత్నవేలు వైపు మొగ్గుచూపారు.రత్నవేలుని అడిగితే అయన ఓకే అన్నాడు గానీ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కావడానికి టైం పడుతుందన్నాడు.ఇంతకీ అయన చేస్తున్న సినిమా ఏంటో తెలుసా? చరణ్ నిర్మాతగా,చిరు హీరోగా చేస్తున్న ఖైదీ నెంబర్ 150 .అటుతిరిగి ఇటుతిరిగి చూస్తే చరణ్ సినిమా ఓ నెల లేటు కావడానికి చిరు కారణమయ్యాడు.కాదంటారా?

SHARE