Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి తన తండ్రితో నిర్మించబోతున్న ఉయ్యాలవాడ బయోపిక్ చిత్రాన్ని సెట్స్‌పై తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం సుకుమార్‌ను చరణ్ ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. చరణ్ ఒక వైపు ఆరాట పడుతున్న సమయంలో మరో వైపు చిత్ర నిర్మాత మాత్రం షూటింగ్‌ను అర్థాంతరంగా ఆపేయించినట్లుగా తెలుస్తోంది.
మొన్నటి వరకు రాజమండ్రిలోని గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ సినిమాను ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుతున్నారు. అయితే రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ మండిపోతుంది. దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో ఇంత ఎండలో షూటింగ్స్ మంచిది కాదని దర్శకుడితో నిర్మాత చర్చించి వాయిదా వేయించినట్లుగా తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఔట్ డోర్ షూటింగ్ చేయాల్సి ఉంది. కాని ఇటీవలే సమంత ఇదే సినిమా షూటింగ్ సందర్బంగా వేడికి వడదెబ్బ బారిన పడ్డ విషయం తెల్సిందే. అందుకే చిత్ర యూనిట్ సభ్యుల అందరి క్షేమం కోసం నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను దర్శకుడు సుకుమార్ ప్రకటించబోతున్నాడు.