చెర్రీ సినిమా ముహూర్తం ఫిక్స్..

Posted March 28, 2017

ram charan sukumar movie shooting date fixధృవ సినిమా ఇచ్చిన జోష్ తో రామ్ చరణ్ సుకుమార్ తో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అలానే నాన్నకు ప్రేమతో మూవీతో హిట్ అందుకున్న సుకుమార్ కూడా చెర్రీకి ఓకే చెప్పాడు. దీంతో సినిమాకు కొబ్బరికాయను కొట్టేశారు. కొబ్బరికాయ అయితే పగిలింది కానీ సినిమా షూటింగ్ మాత్రం పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరో పక్క సమంత ఈ సినిమా  నుండి జూన్ నాటికి రిలీవ్ అవ్వాల్సిఉంది. దీంతో అభిమానులు అసలు సుకుమార్, చెర్రీ కాంబినేషన్ లో సినిమా ఉందా అన్న సందేహంలో పడ్డారు. ఈ సందేహాలకు చెక్ పెడుతూ నిన్న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా చెర్రీ లుక్ ని విడుదల చేశాడు దర్శకుడు సుకుమార్. తాజాగా షూటింగ్ డేట్ ని  కూడా ఎనౌన్స్ చేశాడు.

ఏప్రిల్ 1 నుండి  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నామని ప్రకటించాడు. ఏపీలోని ఓ పల్లెలో జ‌రిగే ప్రేమ‌క‌థ‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు సుకుమార్.  పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటేనే చెర్రీ కాస్త మోటుగా, ఘాటుగా ఉంటాడని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. చెర్రీ ఇప్పటివరకు పల్లెటూరి అబ్బాయిగా నటించలేదు. అలానే సుకుమార్ కూడా ఇప్పటివరకు సిటీ బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీలను తెరకెక్కించాడు. మరి  ఈ పల్లెటూరి ప్రేమకధతో సుకుమార్, చెర్రీ  ఎలాంటి హిట్ అందుకుంటారో  చూడాలి. ఇక  అభిమానులు ఎక్స్ పెక్ట్ చేసిన విధంగా చెర్రీ రోల్ ఉండనుందో లేదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. 

SHARE