చెర్రీ సినిమా ముహూర్తం ఫిక్స్..

0
385
ram charan sukumar movie shooting details

Posted [relativedate]

ram charan sukumar movie shooting detailsధృవ సినిమాతో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సూపర్ విజయాన్ని అందుకున్నాడు. దీంతో అతను చేయబోయే నెక్ట్స్ సినిమా గురించి అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే సుకుమార్ కాంబినేషన్ లో సినిమాను ఎనౌన్స్ చేశాడు చెర్రీ. ఎనౌన్స్ మెంట్ మినహా సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడంతో అభిమానులు కాస్త నిరాశచెందారు. వారి నిరాశను పోగొట్టేలాగా చెర్రీ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. క్రేజీ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభం కానుందని చెర్రీ, సుకుమార్లు ప్రకటించారు.

ఇక ఈ మూవీలో చెర్రీ సరసన సమంత నటిస్తోందని, ఆమె ఈ నెల 22నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వనున్నట్లు వారు వెల్లడించారు. ఈ సినిమా నుండి సమంత తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్ని తోసిపుచ్చింది చిత్రయూనిట్. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు పల్లెటూరి మొనగాడు, రేపల్లె అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కాగా ఈ సినిమాను జులై నాటికి కంప్లీట్ చేసి ఆగష్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

Leave a Reply