చరణ్ కి బ్రేక్ కావాల్సిందే…

0
391

 ram charan take break after finishing dhruva movieరామ్ చరణ్ ప్రస్తుతం ధృవ పనుల్లో బిజీగా ఉన్నాడు. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్రబృందం కష్టపడుతోంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత కావడంతో.. అన్ని పనులు చకచకా సాగిపోతున్నాయి. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడు. సినిమా సినిమాకి బ్రేక్ తీసుకోవడం చరణ్‌కు అలవాటే.

దీంతో ధృవ తర్వాత కూడా ఈ హీరో బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటివారంలో ఈ చిత్రం రిలీజ్ అయితే.. నవంబర్ చివర్లో సుకుమార్ సినిమా మొదలుపెడతాడట చరణ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే కొత్త చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తాడు.  

Leave a Reply