చరణ్ తో ఆ డైరెక్టర్ స్టోరీ డిస్కషన్..

 Posted March 24, 2017

ram charan tej story discussion with mani ratnam for movie
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అద్వితీయమైన గెస్ట్ తో కొన్ని గంటలపాటు గడిపారు.ఓ కొత్త సినిమా మీద చర్చలు జరిపారు.ఆ స్పెషల్ గెస్ట్ ఇంకెవరో కాదు..దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. ది గ్రేట్ మణిరత్నం.ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నా మళ్లీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే వుంది.ఈసారి ఆ అడ్డంకులన్నీ తొలిగిపోయి మేటర్ స్టోరీ డిస్కషన్ దాకా వచ్చినట్టు సమాచారం.చెలియా చిత్రం ఫంక్షన్ కోసం మణి హైదరాబాద్ వచ్చారు.మాములుగా అయితే ఆయన రాత్రికి చెన్నై వెళ్లిపోయేవాళ్లట.అయితే చరణ్ రిక్వెస్ట్ మీదట స్టార్ హోటల్ లో బస చేశారట.చరణ్ తో తమ కాంబినేషన్ లో రాబోయే సినిమా స్టోరీ గురించి ఈ ఇద్దరూ చర్చించారట. అసలు చరణ్,మణి మధ్య ఇంత ఇంటిమసీ ఏర్పడడానికి కొన్ని కారణాలు వున్నాయి..అవేంటో తెలుసా ?

మణి భార్య సుహాసిని,చరణ్ తండ్రి చిరు మంచి ఫ్రెండ్స్.సుహాసిని హైదరాబాద్ వస్తే చిరు ఇంటికే వచ్చేంత చనువుంది.చిరు భార్య సురేఖతో మంచి ఫ్రెండ్ షిప్ వుంది.అలా చిన్నప్పటి నుంచి చరణ్ ని చూస్తూనే వుంది సుహాసిని మణిరత్నం.అయితే ఈ మధ్య చరణ్ కి వరస ప్లాప్స్ వచ్చినప్పుడు మణి సలహా అడిగారట చరణ్.అప్పుడు ఆయన రొటీన్ సినిమాలకి దూరంగా ఉండమని ఓ సలహా ఇచ్చారట.దాన్ని ఫాలో అయిన తరువాతే ధ్రువ సినిమా చేశారట చరణ్.ఆ రిజల్ట్ చూసాక మణి జడ్జిమెంట్ మీద గురి కుదిరిన చరణ్ ఎప్పటినుంచో పెండింగ్ లో వుంటూ వస్తున్న ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

SHARE