దసరాకి చెర్రీ మరో గిప్ట్….

0
343

Posted [relativedate]

  ram charan tej sukumar movie starting dasara

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పటికే మెగా అభిమానుల కోసం దసరా గిఫ్ట్ ని రెడీ చేసిన విషయం తెలిసిందే. చెర్రీ తాజా చిత్రం ‘ధృవ’ టీజర్ ని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర్రంలో రాంచరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. విలన్ గా అరవింద్ స్వామి కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తోనే అంచనాలని పెంచేసింది. ఇక, దసరా టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు కావడం ఖాయమంటున్నారు.

అయితే, ఈ దసరాకి చెర్రీ మెగా అభిమానులకి మరో గిఫ్ట్ ని కూడా అందించబోతున్నాడు. ‘ధృవ’ తర్వాత రాంచరణ్ దర్శకుడు సుకుమార్ తో జతకట్టనున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో చెర్రీన్ని కొత్తగా చూపిస్తానని సుక్కు చెబుతున్నాడు. ఇప్పుడీ చిత్రాన్ని దసరా రోజున ప్రారంభించనున్నారు. ఇక, నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Leave a Reply