Tuesday, August 16, 2022
HomeEntertainmentCinema Latestరంగస్థలంపై చరణ్‌ చేయబోతున్నదేంటి?

రంగస్థలంపై చరణ్‌ చేయబోతున్నదేంటి?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌చరణ్‌ ‘ధృవ’ చిత్రం తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్‌ తీసుకుని సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం అవ్వడంతో పలు టైటిల్స్‌ ప్రచారం జరిగింది. రేపల్లె అంటూ ఎక్కువ రోజులే ప్రచారం జరిగింది. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ టైటిల్‌ కాదు అంటూ తేల్చి చెప్పారు. ఇటీవలే రామ్‌ చరణ్‌ ఒక వీడియో సందేశంను ఫ్యాన్స్‌కు ఇచ్చాడు. సుకుమార్‌ నాలుగు టైటిల్స్‌ అనుకుని పెట్టుకున్నారు. ఆ నాలుగు టైటిల్స్‌ కూడా నాకు నచ్చాయి. అయితే అందులోంచి ఒకటి ఫైనల్‌ చేయమంటే మాత్రం ఆలస్యం చేస్తున్నాడు. నేను ఎంత అడిగానా చూద్దాం అంటున్నాడు, మీరు అయినా సుకుమార్‌ గారిని ఒత్తిడి చేసి ఫైనల్‌ చేయించండి అంటూ ఫ్యాన్స్‌ను కోరడం జరిగింది.

చరణ్‌ కోరిక మేరకు ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు అంతా కూడా సుకుమార్‌పై సోషల్‌ మీడియాలో ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. చరణ్‌ మూవీ టైటిల్‌ ప్రకటించాలంటూ ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు చరణ్‌ మూవీ పేరు ఏంటి అనేది సుకుమార్‌ ప్రకటించాడు. ‘రంగస్థలం 1985’ టైటిల్‌గా నిర్ణయించినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ టైటిల్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ రంగస్థలం ఏంటి ఈ 1985 ఎందుకు అంటూ చర్చ మొదలైంది. సినిమా కథ 1985కు సంబంధించినదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి టైటిల్‌ ప్రకటించిన వెంటనే సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. చిత్రాన్ని దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని మొదట భావించారు. అయితే ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.

- Advertisment -
spot_img

Most Popular