మెగా కోడలి రాయబారం ఫలిస్తుందా..??

0
751
ram charan wife upasana compromise to akhil and shriya bhupal

Posted [relativedate]

ram charan wife upasana compromise to akhil and shriya bhupalఅక్కినేని వారసుడు అఖిల్ కి,  జీవీకే మనవరాలు  శ్రియా భూపాల్ కి ఎంతో గ్రాండ్ గా నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాళ్లిద్దరూ పలు కారణాల వల్ల విడిపోయారని, పెళ్లి ఆగిపోయిందని రకరకాల వార్తలు గత 20 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు అక్కినేని ఫ్యామిలీగానీ ఇటు జీవీకే ఫ్యామిలీ గానీ నోరు విప్పలేదు. అందుకు కారణాలు  ఉన్నాయని తాజా సమచారం.

ram charan wife upasana compromise to akhil and shriya bhupalఅఖిల్, శ్రియ మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రయత్నిస్తోందట. జీవీ కృష్ణారెడ్డి కుటుంబంతో ఉపాసన కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. శ్రియకు కూడా ఆమె మంచి స్నేహితురాలు. ఈ చనువుతోనే ఉపాసన  వీరిద్దరినీ కలిపేందుకు ట్రై చేస్తోందట. అందుకే నాగ్ కానీ, అఖిల్ గానీ ఈ విషయంపై స్పందిచడంలేదని తెలుస్తోంది. మరి ఈ మెగా  ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a Reply