Posted [relativedate]
ఈ రోజు మహిళా దినోత్సవం. ఈ రోజున అభివృద్ది సాధించిన మహిళల కీర్తి కొనయాడబడుతుంది, వారిని సత్కరిస్తుంటారు. సినీ సెలబ్రిటీలు కూడా మహిళలకు సామాజిక మాద్యమాల్లో తమ అభినందనలను తెలియజేస్తారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై స్పెషల్ ట్వీట్ చేశాడు.
సుకుమార్ దర్శకత్వంలో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమాలో చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ సినిమాలకు ఎంత ప్రాధాన్యమిస్తాడో తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తాడు. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మెగా కుటుంబంలోని మహిళల గ్రూప్ ఫొటోని షేర్ చేశాడు. తన జీవితానికి వాళ్లందరూ అనుకూల శక్తి అని కామెంట్ చేశాడు చెర్రీ. ఈ ఫొటోలో మెగా లేడీస్ అందర్నీ ఒకే చోట చూడచ్చు మెగా అభిమానులు.