చెర్రీ వర్రీ అందుకే..

  ram charan worry about his tollywood position
టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిలోకి తానే వెనకపడుతున్నాడా? ఇదే ఆలోచన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కంగారు పెడుతోంది.మగధీర తరువాత నేరుగా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడని చరణ్ గురించి అంతా మాట్లాడుకున్నారు.ఆరెంజ్ ప్లాప్ తరువాత వచ్చిన వరస హిట్ లు చరణ్ సత్తాని చాటాయి. అయితే ఎప్పుడైతే గబ్బర్ సింగ్ తో బాబాయ్ పవన్ ఫామ్ లోకి వచ్చాడో పవన్ నెమ్మదిగా ఫేడ్ అవుతున్నాడు.మరో వైపు అల్లు అర్జున్ కూడా వరస హిట్లతో మార్కెట్ బాగా పెంచుకున్నాడు.ఇక వరుణ్ తేజ్,సాయి ధరమ్ కూడా తమదైన దారిలోముందుకెళ్తున్నారు.

పవన్ ..మహేష్ తరువాత స్థానం కోసం తనతో పోటీపడ్డ ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ హిట్స్ తో ఆ ఇద్దరితో ఢీకొడుతున్నాడు.ఈ పరిస్థితుల్లో చరణ్ భవిష్యత్ గురించి మెగా క్యాంపు ముఖ్యులు సీరియస్ గా ఆలోచిస్తే కొన్ని లోపాలు కనుక్కున్నారంట.రచ్చ,నాయక్,ఎవడు లాంటి సినిమాలు కలెక్షన్స్ కురిపించినా వరసగా మాస్ సినిమాలు చేయడం వల్ల ఫామిలీ ఆడియన్స్ కి దూరమైనట్టు చిరు,,చరణ్ గుర్తించారట.

ఎన్టీఆర్ ఆ తప్పు దిద్దుకుని మళ్లీ రేసులోకి వస్తే తాము ఫ్యూచర్ ని పట్టించుకోకుండా తప్పటడుగులు వేశామని తండ్రీకొడుకులు భావిస్తున్నారట.సుకుమార్ సినిమాతో ఆ లోటు తీర్చుకుని ..జయాపజయాల కన్నా అన్ని వర్గాల ఆడియన్స్ కి చేరువ కావడానికి చరణ్ డిసైడ్ అయ్యారంట.ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతున్న ధ్రువ కూడా విభిన్నంగా ఉంటుందని చరణ్ అనుకుంటున్నారు.ఆ తరువాత కూడా వైవిధ్యానికి పెద్ద పీట వేసి మళ్లీ టాప్ చైర్ రేసులోకి దూసుకు రావాలని చరణ్ ఆలోచన…అల్ ది బెస్ట్ చెర్రీ ..

SHARE