కొత్త లుక్ తో కేక పెట్టించాడు..!

Posted November 29, 2016, 11:28 am

Image result for ram energetic star beard images

ఎనర్జిటిల్ స్టార్ రామ్ ఈ సంవత్సరం నేను శైలజ హిట్ కొట్టగా హైపర్ గా కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమా కరుణాకరణ్ డైరక్షన్లో సిద్ధమవుతున్న రామ్ క్తొత లుక్ తో అందరికి హెలో చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న గడ్డెం ట్రెండ్ కంటిన్యూ చేస్తూ కొత్త లుక్ తో రామ్ కేక పెట్టించాడు. అసలైతే అనీల్ రావిపూడితో సినిమా ప్లాన్ చేసిన రామ్ ఎందుకో ఆ సినిమా నుండి వెనక్కి తగ్గాడు.

ఇక కరుణాకరణ్ తో మరోసారి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఎందుకంటే ప్రేమంట సినిమా చేసినా అది అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ క్రమంలో ప్రస్తుతం స్వింగ్ లో ఉన్న రామ్ మళ్లీ కరుణాకరణ్ తో ఫిక్స్ అయ్యాడు. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుందట. క్రేజీ ఫీలింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది. మరి గడ్డెం లుక్ తో సర్ ప్రైక్ చేస్తున్న రామ్ ఈసారి కరుణాకరణ్ తో అదిరిపోయే హిట్ అందుకుంటాడేమో చూడాలి.

అటు లవ్ స్టోరీస్.. ఇటు కమర్షియల్ సబ్జెక్ట్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ తన ఫ్యాన్స్ సాటిస్ఫై చేస్తున్న రామ్ కెరియర్ లో మళ్లీ నేను శైలజ లాంటి హిట్ అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమలతో కూడా మరో మూవీ ప్లానింగ్ లో ఉన్నాడట. కరుణాకరణ్ సినిమా కం ఫాం చేసుకున్నాక అది స్టార్ట్ చేస్తారట.