Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా చెత్త సినిమాలు చేస్తూ వచ్చాడు. బాలీవుడ్లో కూడా ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలు చేసిన రామ్ గోపాల్ వర్మ అక్కడ కూడా పూర్తిగా విఫలం అవుతున్నాడు. గత పది సంవత్సరాలుగా ఒక్కటి అంటే ఒక్కటి కూడా భారీ సక్సెస్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయిన వర్మ వివాదాలను, విమర్శలను మూటకట్టుకుంటున్నాడు తప్ప సక్సెస్‌లను మాత్రం కొని తెచ్చుకోలేక పోతున్నాడు.
అమితాబచ్చన్‌తో వర్మ అప్పట్లో చేసిన ‘సర్కార్’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘సర్కార్ 2’ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ నమ్మకంతోనే వర్మకు తాజాగా మరో అవకాశాన్ని అమితాబచ్చన్ ఇచ్చాడు. కాస్త ఓవర్ యాక్షన్ చేసి, అతిగా నమ్మకం పెట్టుకున్న వర్మ ‘సర్కార్ 3’ సినిమాను అట్టర్ ఫ్లాప్ చేశాడు. నేడు విడుదలైన సర్కార్ చిత్రంపై విమర్శకులు దుమ్మెత్తి పోస్తున్నారు. గత సర్కార్ చిత్రాల పరువు తీసే విధంగా ఈ సర్కార్ ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో నమ్మకం పెట్టుకుని వర్మకు అమితాబ్ అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని కూడా వర్మ దుర్వినియోగిం చేసుకున్నాడు. వర్మ ఇకపై సినిమాలైనా మానేయాలి, లేదా తను మునుపటిలా అయినా సినిమాలు తీయాలి అంటూ వర్మ అభిమానులు కోరుతున్నారు.