Posted [relativedate]
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఓ సెన్సేషన్.. అటు కొత్త సినిమాలను తీసి ట్రెండ్ సెట్ చేయడంలోనూ ఇటు సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ వర్మ రూటు సపరేటు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు దర్శకత్వాల్లో వర్మ దర్శకత్వం వేరయా అని చెప్పచ్చు. ఇక సోషల్ మీడియా విషయానికొస్తే… వర్మ తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తుంటాడని, ట్వీట్లు పెడుతూ అందర్నీ విమర్శిస్తుంటాడని చాలా మంది నోరు పారేసుకుంటారు. కానీ.. వర్మ చాలా సార్లు చాలా మందిని విమర్శించినా కొన్ని కొన్ని సార్లు మాత్రం నిజాలే మాట్లాడుతుంటాడని ఒప్పుకోవాలి. మాటలకు ముసుగువేయకుండా కొన్ని వాస్తవాల్ని ఓపెన్ గా డిస్కస్ చేస్తుంటాడు వర్మ. నిన్న హోలీ సందర్భంగా వర్మ చేసిన ట్వీటే ఇందుకు ఉదాహరణ. అతను చేసిన ట్వీట్ ను చూసి చాలా మంది ఫైర్ అయ్యారు. అయినా సరే ఇటువంటి ఫైరింగ్స్ ని వర్మ అస్సలు కేర్ చెయ్యడు.అదరడు.. బెదరడు. అటువంటి వర్మకి వయసు మీద పడిందా అంటే అవుననే అంటున్నారు అతని సన్నిహితులు.
ఉన్నత భావాలతో పాటు వివాదాస్పద భావాలు ఉన్న వర్మ కూడా వయసు వస్తున్న కొద్ది సాధారణ అభిప్రాయాలున్న వ్యక్తిలాగా ఎక్స్ పోజ్ అవుతున్నాడని అంటున్నారు.
ఇప్పటివరకు కేవలం కామెంట్లు పెట్టి వదిలేసేవాడు.. ఎవరేమీ అన్నా పట్టించుకునే వాడు కాదు వర్మ. అయితే ఇప్పుడు కాస్త దారి మళ్లించాడు. కామెంట్ చేసిన తరువాత సారీ చెబుతున్నాడు… కాంప్రమైజ్ అవుతున్నాడు. గతంలో మెగా కాంపౌండ్ హీరోలతో పాటు మరికొంత మంది పొలిటికల్ లీడర్స్ విషయాల్లో దురుసుగా ప్రవర్తించిన వర్మ…తరువాత ఒక సందర్భంలో సారీ చెప్పాడు. అలాగే రీసెంట్ గా మహిళా దినోత్సవాన్ని సందర్బంగా వర్మ చేసిన ట్వీట్ పై దుమారం రేగడంతో మహిళాలోకానికి సారీ చెప్పాడు.
ఇప్పటి వరకు ఏ సెంటిమెంట్ ని ఫాలో అవ్వని వర్మ సర్కార్-3 రిలీజ్ విషయంలో మాత్రం కాస్త సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. వర్మ సినీ కెరీర్ లో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగని రీతిలో సర్కార్ -3 సినిమాని తన పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేయనున్నాడు. హీరోల్లో , దర్శకనిర్మాతల్లో చాలా మంది ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతుంటారు. సినిమాకు హైప్ తీసుకురావడానికి మూవీని కానీ, ట్రైలర్ ని కానీ, ఆడియోని కానీ తమ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తుంటారు. తాజాగా వర్మ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు.
ఇక తనకు ఏ మాత్రం ఎమోషన్స్ లేవని వర్మే స్వయంగా చాలా సందర్భాల్లో తెలిపాడు. అయితే సర్కార్-3 సినిమా ప్రమోషన్ లో భాగంగా అమితాబ్ ఇచ్చిన ఇంటర్ వ్యూ చూసి కన్నీరు పెట్టుకున్నానని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏ మాత్రం హింట్ ఇచ్చేవాడు కాదు వర్మ. అయితే వంగవీటి సినిమా తర్వాత ఇకపై తాను తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించనని ప్రకటించాడు వర్మ. వర్మ వాళ్ల అమ్మగారు కూడా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో రాము ఓ యోగిలా, సైంటిస్ట్ లా అనిపిస్తాడని తెలిపారు. మరి అటువంటి వర్మకు ఇప్పుడు ఏమైంది… ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా ఇప్పడూ ఈ పరిణామాలు ఎందుకు సంభవిస్తున్నాయి. అంటే అందుకు ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. వర్మకు వయసు మీద పడుతోంది.. ఇది నిజంగా నిజమేనా.. ఒక వేళ అదే నిజమైతే వర్మ ఇంతకుముందులా డిఫరెంట్ గా ఆలోచించలేడా… శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలను వర్మ నుండి ఇక మనం ఎక్స్ పెక్ట్ చేయలేమా… ఏమో అది వర్మకే తెలియాలి.