వర్మ పై మండిపడుతున్న పంతుళ్లు…

    ram gopal varma comment teachers day greeting beer bottle

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శుభాకాంక్షలు చెప్పిన విధానంపై గురువులంతా మండిపడుతున్నారు. ఆయన శుభాకాంక్షల్లో ఓ మద్యం బాటిల్ ఫోటో పెట్టడం.. గురువుల దగ్గరకన్నా గూగుల్ దగ్గర పాఠాలు నేర్చుకోండని పిల్లలకు సలహా ఇవ్వడం చాలా మందికి కోపం తెప్పించింది . ఈ పరిణామంపై మండిపడుతున్న ఉపాధ్యాయులు కొందరు వర్మపై కేసులు దాకా వెళ్ళాడు. ఇదంతా రామ్ గోపాల్ వర్మకి కొత్తేమీకాదు. వివాదాలకు ఆయనెప్పుడూ దగ్గరగా ఉండటమే కాదు. వాటిని రాజేస్తూఉంటారు కూడా!

సినిమా రంగంలో తాను ఎవరి దగ్గరి పని నేర్చుకోలేదన్న అభిప్రాయంలో వున్న వర్మకు గురువులంటే గొప్ప అభిప్రాయం ఉండిఉండకపోవచ్చు. ఆయన చెప్పినట్టు గురువులంతా శిష్యుల్ని అద్భుతంగా తీర్చి దిద్దిలేకపోయిఉండొచ్చు, కానీ కొందరు గురువులు మాత్రం తమ శిష్యుల మీద గొప్ప ప్రభావాన్ని చూపించి మాత్రం నిజం.. ఇపుడు తిక్క అని అందరూ అంటున్న వర్మ డిఫరెంట్ ఆలోచనా వాళ్ళ పాఠాలు చెప్పే గురువు కావచ్చు. జీవిత పాఠాలు నేర్పిన అనుభవం కావచ్చు. ఆ విషయాన్ని వర్మ గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది…

SHARE