Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌గా స్పందన వస్తుంది. విమర్శించే వారు కూడా ఉన్నారు. అయితే ఏ విషయంపైనైనా కాస్త అతిగా స్పందించే రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదలైన ‘బాహుబలి 2’పై కూడా పలు ట్వీట్స్ చేస్తున్నాడు. విడుదలకు ముందు ‘బాహుబలి 2’ను ఒక డైనోసర్‌తో పోల్చిన వర్మ ఇప్పుడు మరో ఆసక్తికర ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ ప్రపంచంలో కాలాన్ని క్రిస్తు శకం మరియు క్రీస్తు పూర్వ అని ఎలా డివైడ్ చేశారో అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని కూడా ఇకపై బాహుబలికి ముందు మరియు బాహుబలి తర్వాత అంటూ డివైడ్ చేయాలంటూ వర్మ చెప్పుకొచ్చాడు. బాహుబలి రాకతో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని కూడా బ్రేక్ కావడం ఖాయం అని, దాంతో ఇకపై కొత్తగా వచ్చే సినిమాలన్ని కూడా ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాల్సిందే కనుక వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా సాధించని వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ను ఈ సినిమా సాధించబోతున్నట్లుగా ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.