రాయుడిపై రెచ్చిపోయిన వర్మ…

0
497
ram gopal varma controversial tweets on pawan kalyan katamarayudu

 Posted [relativedate]

ram gopal varma controversial tweets on pawan kalyan katamarayuduగత కొంతకాలంగా రామ్ గోపాల వర్మ.. పవన్ కళ్యాణ్ మధ్య సోషల్ మీడియా యుద్దం జరుగుతోందన్న విషయం తెలిసిందే. పవన్ తన పని తాను చూసుకుంటున్నా.. వివాదాస్పద వర్మ మాత్రం పనిగట్టుకుని పవన్ పై ట్వీట్ల బాణాలను వదులుతున్నాడు. ఇక పవన్  సినిమా కాటమరాయుడికి డివైడ్ టాక్  రావడంతో వర్మ ట్వీట్ల పండగ చేస్తున్నాడు. అతని ట్వీట్లు ఓ స్టోరీని తలపించే విధంగా ఉన్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కంటే డిజాస్టర్ సినిమా చూడలేనని అనున్నకున్నా కానీ.. కాటమరాయుడు  ఆ లోటు భర్తీ చేసింది అంటూ ట్వీట్ చేశాడు వర్మ.  ఎవరో 70 ఏళ్ల వ్యక్తి వచ్చి ‘కాటమరాయుడు’ చూడటం కంటే పోర్న్ సినిమా చూడటం మేలని అన్నాడట. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్నందుకు పవన్ గర్వపడటం మాని.. ఒక మంచి సినిమాను చేయమని సూచించాడు వర్మ.  బాహుబలి2 ట్రైలర్‌ ను చూసిన తర్వాత కూడా పవర్ లేని ఇలాంటి సినిమాలను ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు అని మరో ట్వీట్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ భ్రమల్లో బతుకుతుంటారని వారిని కూడా విమర్శించాడు వర్మ. ఇలా తనదైన శైలిలో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు వర్మ. మరి ఈ ట్వీట్లపై పవన్, పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply