340 కోట్ల హాలీవుడ్ మూవీ తీస్తున్న వర్మ..!

Posted November 7, 2016

vr1716సంచలనం ఇంటిపేరుగా మార్చుకున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ. బడ్జెట్ లిమిటేషన్ అనేదేమి లేకుండా ఐదంటే ఐదు రోజుల్లో సినిమా తీసి పెట్టేయగలడు. అలాంటి వర్మ ఇప్పుడు ఏకంగా ఓ ఇంటర్నేషనల్ మూవీ తీస్తున్నాడని షాకింగ్ న్యూస్. సి.ఎం.ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

న్యూక్లియర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అమెరికా, చైనా, రష్యా, ఇండియన్ యాక్ట్రెస్ ఇందులో నటిస్తారని తెలుతుంది. అంతేకాదు సినిమా ఎనౌన్స్ చేయడమే స్టోరీ సినాప్సిస్ ఇచ్చాడు వర్మ. న్యూక్లియర్ బాంబ్ గురించి వర్మ ఇందులో ప్రస్థావించబోతున్నారు. ఒకవేళ ఆ బాంబ్ వాడటం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న కథతో ఈ సినిమా ఉండబోతుంది. వర్మ తక్కువ బడ్జెట్ తో సినిమా తీసినా దానిలో టెక్నికల్ గా అప్డేటెడ్ గా ఉంటాడు. ఇప్పుడు ఏకంగా 340 కోట్ల మూవీ అంటే హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి వర్మ తీసే ఈ సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

SHARE