ఆ ఒక్కమాటతో కన్నీళ్లు పెట్టుకున్న వర్మ

0
493
ram-gopal-varma-emotional-tweet

ram-gopal-varma-emotional-tweet

రామ్ గోపాల్ వర్మ.. అటు సోషల్ మీడియాలోనైనా ఇటు ఫిల్మిం ఇండస్ట్రీలోనైనా ఓ సంచలనం. సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం గురించి స్పందిస్తూ ఏదో ఒక రకంగా వ్యాఖ్యలు చేస్తుంటాడు..  ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటుంటాడు. వర్మ చేసే  వివాదాస్పద వ్యాఖ్యలతో కొంతమంది ఫైర్ అవుతుంటే మరికొందరు  ఎమోషన్ అవుతుంటారు. అయితే ఈ సారి ఎమోషన్ అవ్వడం వర్మ వంతయ్యింది. అదోదే ట్వీట్ గురించి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వర్మ ఎమోషన్ అయ్యింది బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ ఇంటర్ వ్యూ విని.

వివరాల్లోకి వెళ్తే…

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ సర్కార్-3 సినిమా చేస్తున్న  సంగతి తెలిసిందే. ఈ సినిమా వర్మ పుట్టిన రోజు సందర్భంగా  వచ్చే నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు. దీంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ని ప్రారంభించేసింది. ఇందులో  భాగంగా అమితాబ్..  సుభాష్‌ ఘాయ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ ఘాయ్ అమితాబ్ ని కొన్ని  ప్రశ్నలు అడిగారట.  వర్మ స్థిరత్వంలేని దర్శకుడు అనే ప్రశ్నకు అమితాబ్‌ స్పందిస్తూ… స్థిరత్వం లేకపోవడమనేది ఓ విచిత్రమే. ఒకేలా ఉండే నేపథ్యాలు, సినిమాలు ప్రేక్ష‌కుల‌కి బోర్‌ కొట్టిస్తాయి. ఎప్పుడూ నల్లరంగు దుస్తులే వేసుకున్నప్పుడు వేరే రంగులోని అందాన్ని, అంతాన్ని గుర్తించడం కష్టం. ఒకే రంగు దుస్తుల్లో ఉండడం చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే రాంగోపాల్‌ వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే తత్వం. ఎప్పుడూ తన ఆలోచనల నుంచి ఏదో ఒక కొత్తదనం రావాలనుకునే వ్యక్తి వ‌ర్మ అని అమితాబ్ సమాధానమిచ్చారు.  ఈ ఇంటర్ వ్యూ విన్న వర్మ కాస్త ఎమోషన్ అయ్యాడట. కన్నీరు కూడా పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని వర్మే స్వయంగా ట్వీట్ చేశాడు. బిగ్ బీకి తనపై ఉన్న ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలని అనుకుంటున్న‌ట్లు వర్మ పేర్కొన్నాడు.
తనకసలు  ఎలాంటి ఎమోషన్స్  ఉండవని వర్మ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మరి అలాంటి వర్మ ఎమోషన్ అయ్యాడంటే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.

Leave a Reply