వంగవీటి రాధా,రాంగోపాల్ వర్మల మధ్య క్లారిటీ వచ్చిందా..!

0
588
rgv

Posted [relativedate]

Related image

వంగవీటి సినిమా నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలను దర్శకుడు రాంగోపాల్ వర్మ కలిశారు. సినిమాలో దివంగత రంగా, రాధాల పాత్రలను ఎలా చూపిస్తారన్న విషయమై వాళ్ల అనుమానాలను నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. వంగవీటి సినిమా నిర్మాణంపై మొదటి నుంచి అభ్యంతరం తెలుపుతున్న వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం భేటీ అయ్యారు. ఇప్పుడు జరిగిన ఈ భేటీలో వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారిని కలిసి, సినిమాలో ఉండే అంశాలను వివరించినట్లు తెలుస్తోంది. వర్మ వంగవీటి సినిమాను టైటిల్ ని ప్రకటించిన దగ్గర నుంచే అనేక వివాదాలు సినిమాను చుట్టుముట్టాయి. ఈ గొడవల మధ్యే షూటింగ్ పూర్తి చేసిన వర్మ ప్రస్తుతం సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ స్వయంగా పాడి రిలీజ్ చేసిన కమ్మ కాపు పాటతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ పాట కుల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని, పాటతో పాటు సినిమాలోని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి వంగవీటి అభిమానులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన కోర్టు పాటతో పాటు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వవద్దని ఆదేశించింది. దీంతో దిగి వచ్చిన వంగవీటి చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఆ పాట, సన్నివేశాలను తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు ఈ భేటి కారణం గా వివాదం సద్దు మణిగింది అనే అనుకోవాలి ..

Leave a Reply