Posted [relativedate]
ప్రతిరోజూ ఏదో ఒక అంశం మీద సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఏదో ఒక రకంగా విమర్శిస్తూనే ఉంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మూడు రోజుల క్రితం కేరళలో హీరోయిన్ భావనపై జరిగిన లైగింక వేధింపుల వ్యవహారం విషయంలో మాత్రం వర్మ సైలెంట్ గా ఉన్నాడు. అందునా ఆమె వర్మ శిష్యుడు కృష్ణవంశీ సినిమా మహాత్మలో హీరోయిన్ గా కూడా నటించింది.
దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ వారు భావనపై జరిగిన లైంగిక దాడి గురించి స్పందిస్తూ తమ స్టైల్లో ఖండిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇంత జరుగుతున్నా తనకు ఏమీ పట్టనట్లు వర్మ సైలెంట్ గా ఉండడంతో సినీ జనం ఆశ్చర్యపోతున్నారు. ఏ అంశం దొరక్కపోతే టాపిక్ వెతుక్కుని మరీ విమర్శించే వర్మ గత మూడు రోజులుగా ఇంత హాట్ టాపిక్ దొరికినా ఎందుకు నోరు మెదపడం లేదో అర్ధం కావడం లేదంటున్నారు.