వర్మ కి ప్రేక్షకుడంటే గౌరవం పెరిగిందా?

Posted December 22, 2016

ram gopal varma promise i will giving good movie for audience
నేలలో లోతుగా పాతుకుపోయిన ఓ వటవృక్షాన్ని పెకలించడం ఎంత కష్టమో? అలాగే తరతరాలుగా ఇలాగే ఉండాలి అనే ఓ అప్రకటిత భావజాలం నుంచి సమాజాన్ని బయటకి తీసుకురావడం అంతకన్నా కష్టం. అయినా ప్రయత్నం చేసేవాళ్ళు వేలల్లో వుంటారు.చివరికి ఒకరిద్దరో ఆ ప్రయత్నం లో గెలుస్తారు..నిలుస్తారు.అలాంటి వారిలో ఒక్కడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఇలాగే ఉండాలి అనే ఆలోచనని భూస్థాపితం చేసిన వర్మ ఓ సంచలనమే కాదు ..ఓ స్ఫూర్తి కూడా ..ఆలా శివతో మొదలైన అయన సినీ ప్రస్థానం వంగవీటి దాకా వచ్చింది.

వర్మ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తులు మరెన్నో పల్లాలు.ఇంకెన్నో సంచలనాలు.ఎన్ని జరిగినా ..అయన పనైపోయిందని ఎంతో మంది అనుకున్నా వర్మని ఆరాధించే వాళ్లకి కొదవ లేదు. అంటే అయన ప్రభావం తెర మీద ఎంత వుందో..తెర వెనుక అంతే వుంది.ఓ మనిషిగా అయన లేవనెత్తే ప్రశ్నలు,జీవించే విధానం లోతైన భావజాలాలకి సమ్మెటపోట్లు.అందుకే వర్మ అభిమానులకి అయన స్పెషల్.వారి దృష్టిలో నిజమైన హీరో.అలాంటి వర్మ సినిమాని గౌరవించినంత ప్రేక్షకుడిని గౌరవించలేదనే చెప్పుకోవాలి.నాకోసం మాత్రమే సినిమా తీస్తా నచ్చితే చూడండి..లేకపోతే వదిలేయండి అని ధైర్యంగా చెప్పే వర్మ ….వంగవీటి విషయానికి వచ్చేసరికి టోన్ మార్చేశారు.ఈ సినిమా మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదని రాజమౌళి మొదలుకొని సామాన్య ప్రేక్షకుడి దాకా ప్రామిస్ చేసేస్తున్నారు.ఇది కాదే వర్మ ..ఇలా ఎందుకు చేస్తున్నాడు?ఈ ప్రశ్న సామాన్య సినీ లవర్ నుంచి నాగార్జున దాకా అందర్నీ వేధిస్తోంది.ఇది వంగవీటి ప్రమోషన్ కి మాత్రమే పరిమితం అనేవాళ్ళు లేకపోలేదు.కానీ ఇక నా నుంచి వచ్చే సినిమాలు అల్లాటప్పాగా ఉండవని శివ టు వంగవీటి సభావేదికపై ఇచ్చిన హామీ వర్మ నిలుపుకుంటాడని ఆశిద్దాం.

SHARE