Posted [relativedate]
మనం అనుకున్నట్టే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ కౌంటర్ మొదలైంది. పెళ్ళైన కూతురుండి కూడా పోర్న్ చూస్తానని చెప్పే ఆయన ఓ రోజు తనను ఎత్తొచ్చు ..ఇంకో రోజు తగ్గించొచ్చు అని వర్మ మీద పవన్ కామెంట్ చేశాడు. ఆ మాటలకి వర్మ ట్వీట్స్ తోనే సమాధానం ఇచ్చాడు.
ఓ అభిమానిగా పవన్ మీద వున్న అంచనాల తో మాట్లాడాను తప్ప ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి,అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని వర్మ తొలి ట్వీట్ వదిలాడు .ఇక రెండో ట్వీట్ లో ‘నా జీవితం …నా లైఫ్ స్టైల్ ..నేను ఆలోచించే విధానం అన్నీ దాచుకోకుండా,దాక్కోకుండా నా ఇష్టం పుస్తకంలో మొత్తం విప్పి రాశా’ అని వర్మ చెప్పాడు.మూడో ట్వీట్ లో ఇంకో చురక వేశాడు.’వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారని రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ని తిట్టారు.మరి వాళ్ళు వేరే ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడొచ్చా ..ఇదేనా వికాసం అని మూడో ట్వీట్ లో అడిగేశాడు వర్మ .ఈ ట్వీట్ల వర్షం ఇప్పటిదాకా కొనసాగుతుందో ఏమో !