Posted [relativedate]
వర్మ ఆత్మ ఏంటి అని షాక్ అవుతున్నారు కూదూ. ఈ విషయం చెప్పింది స్వయానా రామ్ గోపాల్ వర్మే. తాను మూడు జన్మల క్రితమే చచ్చిపోయానని, అప్పటి నుండి తన ఆత్మ మాత్రమే ఇక్కడ తిరుగుతోందని ట్వీట్ చేశాడు.. ఆత్మలకి చావు ఉండదని ఓ స్మైలీ పిక్ ని కూడా పోస్ట్ చేశాడు..
ఏంటి ఈ గోల అనుకుంటున్నారా… అసలు ఏం జరిగిందంటే..
“వర్మ చచ్చిపోయాడు… సిని పరిశ్రమకు పట్టిన పీడ వదిలిపోయింది… పండగ చేసుకోండి” అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ పిక్ ని పోస్ట్ చేశారు. నిద్రలో కూడా సోషల్ మీడియాని కలవరించే వర్మ నుండి ఈ పిక్ తప్పించుకోలేకపోయింది. ఏమాత్రం ఫీలవ్వని వర్మ ఇక తనదైన శైలిలో చేతికి పనిచెప్పాడు. అదేనండి ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు.
”లవ్ యు టు మై డియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. థ్యాంక్స్. మీ అందరికీ నా కౌగిలింతలు” అంటూ ఆ ఇమేజ్ ను వర్మ రీట్వీట్ కూడా చేశాడు. ‘నిరాక్షరాస్యులైన గొర్రెలకు తెలియాల్సిన విషయం ఏంటంటే.. నేను మూడు జన్మల క్రితమే చచ్చిపోయాను. అప్పటి నుండి నా ఆత్మ మాత్రమే ఇక్కడుంది. ఆత్మలకు చావు లేదు” అంటూ సెటైరికల్ స్మైలీని పోస్ట్ చేశాడు.
కాటమరాయుడు రచ్చలో బండ్ల గణేష్.. వర్మని కుక్కతో పోల్చిన సంగతి తెలసిందే. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అని పోకిరి సినిమాలో మహేష్ చెప్పినట్లు ఎవడు ట్వీట్ చేస్తే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే వర్మ అని నిరూపించాడు. తనని కుక్కతో పోల్చిన బండ్లకు మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు వర్మ. ఇప్పుడు తాజాగా వర్మ చచ్చిపోయాడంటూ ప్రచారం చేస్తున్న పవన్ ఫ్యాన్స్ కి కూడా పంచ్ ఇచ్చాడు.
వర్మ చేసే ట్వీట్లకు రీ ట్వీట్లు చేయాలంటే చాలా ఆలోచించాలి. ఒకవేళ చేసినా తిరిగి వర్మ చేసే ట్వీట్లను ఫేస్ చేయడం మాత్రం కాస్త కష్టమే. చావు వార్త విషయంలోనూ వర్మ అలానే రీ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా వర్మ పాలసీ అంతా టేక్ ఇట్ ఈజీలా కన్పిస్తున్నా… డోసేజ్ మాత్రం ట్వీట్లతో స్ట్రాంగ్ గానే ఇస్తాడు. మరి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.