సీఎం ని కోతిగా మార్చిందెవరు?

Posted October 7, 2016

  ram gopal varma said kejriwal looks like monkey
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మనిషి రూపంలో ఉన్న కోతి నా ? కానీ అది నిజమే అంటున్నాడు తిక్క మనిషిగా పేరు పడ్డ దర్శకుడు రాంగోపాల్ వర్మ.ఆయనకి అంత కోపం రావడానికి సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేజ్రీవాల్ చేసిన విమర్శలే కారణం.ఆ స్ట్రైక్స్ కి ఆధారాలేంటని కేజ్రీవాల్ అడగడంతో వర్మకి చిర్రెత్తుకొచ్చింది.మెడలో మప్లర్ తో ఇంతకు ముందు కేజ్రీ రాముకి కోతిలా కనపడేవారంట.ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ తరువాత కామెంట్స్ తో నిజంగా కేజ్రీవాల్ కోతేనని తెలిసింది అంటున్నాడు వర్మ.
దేశ భక్తి లాంటి విషయాల్ని తేలిగ్గా కొట్టిపారేసే వర్మ ఈ స్థాయిలో ఫైర్ అవ్వడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.రాములో ఈ మార్పు ఎన్నాళ్ళో?

SHARE