‘నయీమ్ ల కే నయీం’ అని అంటుంది ఎవరు…?

Posted September 27, 2016

 ram gopal varma said nayeem

ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ తాను నయీమ్ ల కే నయీం అని హెచ్చరిస్తున్నారు. ఆయనకు నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయట. దీని గురించి ట్విటర్ లో తెలియచేస్తూ క్రిమినల్ నయీం జివితం ఆదారంగా సినిమాను తీస్తున్నానని, ఆ విషయం చెప్పినప్పటి నుంచి నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు.అయితే తాను నయీంకే నయీం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వర్మ అన్నారు.నయాం సన్నిహితుడు ఒకరిని ముంబై జైలులో కలిశానని నయీం కు సాయపడ్డ ఐదుగురు పోలీసులను కూడా కలిశానని, అలాగే నయీంతో సంబందం ఉన్న ఇద్దరు నక్సలైట్లను కలిశానని ఆయన వెల్లడించారు.

నయీం తన మరదలి పట్ల ఘోరంగా ప్రవర్తించిన విషయం తెలిసి షాక్ అయ్యాయని, అలాగే కరాచీకి చెందిన ఒక వ్యక్తితో అతనికి సంబందాలు ఉన్నాయి కూడా తెలుసుకున్నానని వర్మ తెలిపారు. మొత్తం మీద వర్మ సినిమా ప్రచారంలో భాగంగా చెబుతున్నారో, నిజంగానే బెదిరింపులు వచ్చాయో కాని విషయాలు ఆసక్తిగానే ఉన్నాయి

SHARE