బుగ్గ గిల్లి.. జోలపాడిన వర్మ

0
615
ram gopal varma say sorry to womens day tweet on sunny leone

Posted [relativedate]

ram gopal varma say sorry to womens day tweet on sunny leoneఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు ఎందరో ప్రపంచ మహిళలకు శుభాకాంక్షలు అందించారు. ఈ శుభాకాంక్షలను అందించిన వారిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నాడు. అయితే ఆ శుభాకాంక్షలకు తన పైత్యాన్ని కాస్త జోడించి ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. గోవాలో విశాఖ మాంభ్రే అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్మ ట్విట్టర్ ఎకౌంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేయాలని పోలీసులను కోరారు.

ముందర తన ట్వీట్స్ ని వర్మ సమర్ధించుకున్నాడు. అయితే మహిళలను కించపరిస్తే మనుగడ కష్టం అనుకున్నట్లు ఉన్నాడు వర్మ… తన ట్వీట్స్ పై కాస్త వెనక్కు తగ్గాడు.  తాను చేసిన ట్వీట్లకు నిజంగా మనస్తాపం చెందిన వారికి తాను క్షమాపణలు చెబుతున్నట్లు ట్వీట్‌ చేశాడు. అదే సమయంలో ప్రచారం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునేవారికి మాత్రం కాదని పేర్కొన్నాడు. కాగా బుగ్గ గిల్లడం ఎందుకు జోలపాడడం ఎందుకు వర్మ.. అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని విషయాల్లో తలదూర్చకుండా, సినిమాలకు దర్శకత్వం వహించడం బెటర్ అని సలహా ఇస్తున్నారు.

Leave a Reply