వర్మలో కొత్తగా ఈ యాంగిల్‌ ఏంటో?

102

Posted April 26, 2017, 6:23 pm at 18:23

ram gopal varma share rgv and his daughter photo in twitter
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదాస్పద పోస్ట్‌తో ట్విట్టర్‌లో లేదా మీడియాలో సందడి చేస్తూ ఉంటాడు. అయితే ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాల గురించి రాజమౌళి స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. ఇటీవలే వర్మ ట్విట్టర్‌ ద్వారా ఇకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయను అని, మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు. ఇకపై ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా ట్వీట్‌లు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి కూడా వర్మ అలాంటి వివాదాస్పద ట్వీట్స్‌ చేయలేదు. అయితే తనదైన శైలిలో పలు అంశాలపై విభిన్నంగా స్పందిస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా ఉన్నట్లుండి తన కూతురుతో చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న ఫొటోను ట్వీట్‌ చేసి అంతా షాక్‌ ఇచ్చాడు.

పైన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసి ‘రాక్షసుడిగా మారక ముందు, నా మానవత్వం ఇంకా బతికే ఉన్న రోజుల్లో నా కూతురుతో దిగిన ఫొటో ఇది అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. వర్మ ఇలాంటి ఫొటో ట్వీట్‌ చేయడం చాలా అరుదు. తన సినిమాలకు సంబంధించిన ఫొటోలు, తన సన్నిహితులతో తీసుకున్న ఫొటోలను మాత్రమే పోస్ట్‌ చేసే వర్మ ఈసారి మాత్రం తన కూతురు ఫొటోను షేర్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. త్వరలోనే తన భార్య ఫొటోను కూడా వర్మ ట్వీట్‌ చేస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here