మెగా ఫాన్స్ ని ఖుష్ చేసిన వర్మ ..

Posted [relativedate]

ram gopal varma tweet chiru khaidi no 150 movie after watching movie
ఒకటిరెండు సార్లు కాదు అవకాశం వచ్చిన ప్రతిసారి మెగా ఫాన్స్ ని హర్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ రూట్ మార్చేశాడు.శాతకర్ణి తో పోల్చి ఖైదీని ఎద్దేవా చేసిన వర్మ ఒక్కసారిగా మెగా స్టార్ ని పొగడ్తలతో నింపి నెటిజన్లకు షాక్ ఇచ్చాడు.మెగా ఫాన్స్ ని ఖుష్ చేశాడు. దీనంతటికీ ఒకటే కారణం అయన ఖైదీ నెంబర్ 150 సినిమా చూడటం.

మెగా స్టార్ లేటెస్ట్ మూవీ చూడకుండా ఎగతాళి చేసిన వర్మ చూశాక ప్రశంసలు కురిపించడం చిత్రమే.ఖైదీ నెంబర్ 150 మెగా మెగా మెగా ఫెంటాస్టిక్ అని రాము ట్వీట్ చేశాడు.చిరు ఎనర్జీ లెవెల్స్ ఇప్పటికీ ఓ రేంజ్ లో ఉన్నాయని పొగిడేశాడు.9 సంవత్సరాల కిందట సినిమాలు వదిలేసినప్పటి కన్నా చిరు ఇప్పుడే యంగ్ గా వున్నారని వర్మ చెప్పుకొచ్చారు.ఇంత చేసి మెగా ఫాన్స్ ని ఖుష్ చేసినా వర్మ మీద వారిలో ఏ మూలనో ఓ సందేహం..ఈయన గారు ఎప్పుడు ఎలా మాట మారుస్తాడా అని? ఏమి చేస్తాం…నేను చెప్పిన మాట మీద నిలబడను అని చెప్పేవారి మాటలపై ఎవరికి నమ్మకం కలుగుతుందిలే ? 

Just saw 150 ..Mega Star is beyond Mega Mega Mega Fantastic ..150 million Cheers to him ..

Mega Star’s Energy levels are SUPREME and he’s looking younger than when he left films some 9 years back ..He’s looking MEGA HANDSOME

Leave a Reply