ఒక మంచి ట్వీట్‌ చేసిన వర్మ

0
465
ram gopal varma tweet on national awards team about aamir khan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ram gopal varma tweet on national awards team about aamir khan
నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు మంచి బూస్ట్‌ను ఇస్తాయి. అవార్డులు వచ్చిన వారు మరింత కష్టపడి, మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల అవార్డుల విషయంలో అన్ని చోట్ల కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి అవార్డు జ్యూరీ మెంబర్స్‌ కూడా రాజకీయాలు చేస్తూ, తమకు అనుకూలమైన వారికి అవార్డులను ఇస్తూ ఉండటం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవ ప్రకటించిన జాతీయ అవార్డుల విషయంలో కూడా పక్షపాతం కనిపిస్తుందని, అవార్డుల ఎంపిక సరిగా జరగలేదంటూ తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ విమర్శలు చేసిన విషయం తెల్సిందే. అయితే మురుగదాస్‌ విమర్శలను జాతీయ అవార్డుల సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే వర్మ మరో సంచలన ట్వీట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అద్బుత సినిమాలను అందించే అమీర్‌ ఖాన్‌కు జాతీయ అవార్డు రాకపోవడంపై వర్మ పరోక్షంగా జాతీయ అవార్డు ఎంపిక జ్యూరీపై విమర్శలు చేశాడు.

వర్మ తాజాగా ట్విట్టర్‌లో అమీర్‌ ఖాన్‌ ఇండియాలోనే ఒక గొప్ప ఫిల్మ్‌ మేకర్‌. ఆయన సినిమాలు జాతీయ అవార్డును సొంతం చేసుకోకున్నా కూడా ఆయన స్థాయి మాత్రం తగ్గదు. ఆయన క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తాడు, ఆ సినిమాలకు అవార్డులు రాక పోవడం దురదృష్టకరం అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. అమీర్‌ ఖాన్‌ చేసిన సినిమాకు ఎందుకు అవార్డు రాలేదు అనే విషయాన్ని జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. వర్మ చేసిన ట్వీట్‌ అందరిని ఆలోచింపజేస్తుంది.

Leave a Reply