Posted [relativedate]
ట్విట్టర్ కామెంట్స్ తో సెలెబ్రెటీలకు సినిమా చూపించడం రామ్ గోపాల్ వర్మ స్టైల్.అయితే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం మాత్రం అలాంటి వర్మకే ఆత్మబలం వంటి హారర్ మూవీ చూపించారు.జయ సమాధిదగ్గర ధ్యానం చేసిన పన్నీర్ సెల్వం ఆమె ఆత్మ తనకి పార్టీని,ప్రభుత్వాన్ని రక్షించమని ఆదేశాలు ఇచ్చిందని సెల్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఆత్మ తనతో మాట్లాడిందని సెల్వం చెప్పడాన్ని అంతా రాజకీయంలో భాగంగా చూస్తుంటే ..వర్మ యధావిధిగా ట్విట్టర్ కి పని చెప్పాడు.
సీఎం గా కొనసాగమని సెల్వం కి అమ్మ ఆత్మ చెప్పింది అనడం చూస్తుంటే హారర్ మూవీ చూసినట్టుంది ..ప్రధాని మోడీ భూత వైద్యుడిగా పనిచేస్తారా అంటూ వర్మ ట్వీట్ చేశారు.మొత్తానికి రాజకీయాల్లో ఆత్మ అనగానే వర్మకి కామెడీగా అనిపించింది.ఆ కామెడీ టచ్ వల్లే వర్మ దెయ్యం సినిమాలు కూడా జనాలకి పెద్దగా ఎక్కలేదేమో!