కళాతపస్వికి అవార్డుపై వింతగా స్పందించిన వర్మ

0
325
ram gopal varma tweets on k vishwanath about Dadasaheb Phalke award

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ram gopal varma tweets on k vishwanath about Dadasaheb Phalke award
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన ప్రతి ముఖ్య విషయం గురించి తనదైన శైలిలో స్పందించి అందరి దృష్టిని ఆకర్షించే వర్మ తాజాగా కళాతపస్వి కె విశ్వనాథ్‌ గారికి దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు రావడంపై వింతగా స్పందించి అందరిని ఆశ్చర్య పర్చాడు. విశ్వనాథ్‌ గారికి అవార్డు రావడం తనకేమంత ఆశ్చర్యంను, సంతోషాన్ని కలిగించలేదంటూ వర్మ ట్వీట్‌ చేశాడు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును కె విశ్వనాథ్‌కు ప్రకటించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు సినీ ప్రముఖులు అంతా కూడా కళాతపస్వికి అభినందనలు తెలుపుతున్నారు. కాని వర్మ మాత్రం ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. తాను దాదా సాహెబ్‌ పాల్కే తెరకెక్కించిన సినిమాలు చూశాను, అలాగే మీ సినిమాలు కూడా చూశాను. మీ పేరుతో దాదా సాహెబ్‌ పాల్కే గారికి అవార్డు ఇవ్వాలి. నా దృష్టిలో దాదా సాహెబ్‌ పాల్కే కంటే కూడా విశ్వనాథ్‌ గొప్ప దర్శకుడు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ వ్యాఖ్యలతో పలువురు సినీ ప్రముఖులు మరియు విశ్వనాథ్‌ అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు.

Leave a Reply