ఆ సీఎం పాత్ర చూపిస్తున్న వర్మ..

 Posted October 25, 2016

ram gopal varma used kejriwal real character in sarkar movieవివాదాలకు..రాంగోపాల్ వర్మకి లింకుందని అనుకుంటారు చాలామంది.అదేమీలేదు..వాళ్లిద్దరూ కవలలు..కలిసి పుట్టారు.కలిసి పెరిగారు.కలిసే బతికేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బీ అమితాబ్ ముఖ్యపాత్రలో వస్తున్న సర్కార్ 3 కూడా వివాదాస్పదమే కాబోతోంది.ఈ సినిమాలో రెండు నిజ జీవిత పాత్రల్ని వర్మ డిజైన్ చేశారు. అందులో ఒకటి విజయమాల్యా క్యారెక్టర్ అయితే ..ఇంకోటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్ర .

సమకాలీన పాత్రల్ని సినిమాకి వాడుకోవడం వర్మకి కొత్త కాకపోయినా…నిజ జీవితంలో తీవ్ర విమర్శ చేసిన వ్యక్తి పాత్రని సినిమాలో చూపించడం ఇదే కావొచ్చు. సర్జికల్ స్ట్రైక్స్ మీద కేజ్రీ సందేహపడినప్పుడు వర్మ కౌంటర్ ఇచ్చాడు.ఆయన్ని ఏకంగా కోతితో పోల్చాడు.అదే లక్షణాలున్న క్యారెక్టర్ ఇప్పుడు సర్కార్ 3 లో వుంది. మనోజ్ బాజ్పాయ్ పోషిస్తున్న ఈ పాత్ర పేరు గోవింద్ దేశ్ పాండే.ఆ పాత్ర వేషధారణ అచ్చు గుద్దినట్టు కేజ్రిని పోలి వుంది.దీంతో సర్కార్ త్రీ లో ఢిల్లీ సీఎం క్యారెక్టర్ ఎలా వుండబోతోదో అని అప్పుడే చర్చ మొదలైంది.ఏమైనా ఇలా ఫ్రీ పబ్లిసిటీ అడక్కుండా చేయించుకోవడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య.

SHARE