Tuesday, August 16, 2022
HomeEntertainmentCinema Latestరామాయణంలో వేలుపెడుతున్న వర్మ.

రామాయణంలో వేలుపెడుతున్న వర్మ.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేవుడెక్కడ అని ప్రశ్నించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్ను రామాయణం మీద పడింది.అయితే దాన్ని ఏదో భారీ బడ్జెట్ సినిమాగా తీయాలని ఆయన అనుకోవడం లేదు. రామాయణంలో వర్మకి విపరీతమైన ఆసక్తి కలిగించిన సన్నివేశం ఒకటుందట. అదేమిటంటే . . తెల్లవారగానే రాముడిని అడవులకి పంపమని కైకేయి,దశరథుణ్ణి అడిగే సీన్.అసలు ఆ రాత్రి ఆ ఇద్దరి మధ్య ఏమి జరిగింది? వాళ్ళు ఇద్దరూ ఏమి మాట్లాడుకున్నారు? ఈ టాపిక్ ని కేంద్రబిందువుగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఓ షార్ట్ ఫిలిం చేస్తున్నారు.

వంగవీటి లాంటి సినిమాలతోనే వర్మ చాలా సంచలనం,అలజడి సృష్టించాడు. ఓ సాంఘిక అంశాన్ని టచ్ చేస్తేనే అంత రాద్ధాంతం జరిగితే కోట్ల మంది మనోభావాలతో ముడిపడ్డ రామాయణం మీద వర్మ కన్ను పడిందంటే ఇక ఎలాంటి పరిస్థితులు ఎదురు అవుతాయో. కానీ నాగబాబు,పవన్, చిరంజీవి సహా తన వల్ల మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడ్డవాళ్లందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పిన వర్మ తనకు ఇప్పుడు పరిణితి వచ్చింది అంటుంన్నాడు.దాన్ని రామాయణం మీద తీయబోయే షార్ట్ ఫిలిం లో వాడితే మంచిది.లేదంటే లేనిపోని వివాదం అవుతుంది.చూద్దాం చివరికి వర్మ ఏమి చేస్తాడో ?

- Advertisment -
spot_img

Most Popular