Tuesday, August 9, 2022
HomeEntertainmentCinema Latestవర్మ మరో సోషల్‌ మీడియా సంచలనం

వర్మ మరో సోషల్‌ మీడియా సంచలనం

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల తాను ‘గన్స్‌ థైయ్స్‌’ సిరీస్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించి చిన్న ట్రైలర్‌ను కూడా వదిలిన విషయం తెల్సిందే. పలు న్యూడ్‌ సీన్స్‌ ఉన్న ఆ ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. వర్మ ఆ వెబ్‌ సిరీస్‌ను ఎప్పుడు విడుదల చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే వర్మ తాను ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాను అంటూ ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సన్నీలియోన్‌కు ప్రస్తుతం దేశంలో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పేరుతో వర్మ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు.

‘మేరి బేటీ సన్నీ లియోన్‌ బన్‌ చహతాహై’ అనే టైటిల్‌తో వర్మ మొదటి షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించడం జరిగింది. నా కూతురు సన్నీలియోన్‌లా అవ్వాలనుకుంటుంది అనేది ఆ షార్ట్‌ఫిల్మ్‌ టైటిల్‌ తెలుగు అర్థం. టైటిల్‌ చూస్తుంటేనే ఆ షార్ట్‌ ఫిల్మ్‌ ఎలా ఉండబోతుందో అర్థం అవుతుంది. రేపు ఉదయం 9 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. మొత్తానికి వర్మ సోషల్‌ మీడియాలో మరో సంచలనానికి తెర లేపాడు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ విడుదల తర్వాత ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.

- Advertisment -
spot_img

Most Popular