హైప‌ర్ మూవీ రివ్యూ…..

0
770

Posted [relativedate]

  ram hyper movie review

చిత్రం : హైప‌ర్ (2016)
న‌టీన‌టులు : రామ్‌, రాశీఖ‌న్నా
సంగీతం : జిబ్రాన్‌
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్‌
నిర్మాత‌లు : రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంక‌ర‌
రిలీజ్ డేట్‌ : 30 సెప్టెంబ‌ర్‌, 2016.

చాన్నాళ్ల తర్వాత “నేను శైలజ”తో హిట్ కొట్టాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఈ చిత్రంతో 2016లో టాలీవుడ్ కి ఫస్ట్ హిట్ ని అందించాడు. రామ్ శుభారాంభం
చేయడం.. ఈ యేడాది టాలీవుడ్ కి బాగా కలిసొచ్చింది. ఇక, ఈ దసరా సీజన్ లో కూడా రామ్ ని ముందుగా రంగంలోకి దిగాడు. రామ్ తాజా చిత్రం ‘హైపర్’. రామ్ సరసన రాశీఖన్నా జతకట్టనుంది. గతంలో రామ్ కి ‘కందిరీగ’లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దసరా సీజన్ లో క్రేజ్ ఉన్న సినిమాల్లో ‘హైపర్’ ఒకటి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హైపర్’ పవర్ ఎంత.. ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :
సూర్య (రామ్).. హుషారైన కుర్రాడు. అందరూ ముద్దుగా సూరి అని పిలుస్తుంటారు. సూరి తండ్రి.. నారాయణ మూర్తి (సత్య రాజ్).. నిజాయితీకి మారుపేరైనా ప్రభుత్వ ఉద్యోగి. సూరికి తండ్రంటే ప్రాణం. ఎంతలా అంటే.. గాయమైన, గుండెపగిలినా ‘అమ్మ.. అమ్మ’కు బదులుగా ‘నాన్న నాన్న..’ పిలిచేంత పిచ్చి ప్రేమ. తండ్రిపై ఈగ కూడా వాలకుండా చూసుకునే రకం. ఈ క్రమంలో ప్రేమతో తండ్రికి నరకం చూపించే క్షణాలు కూడా ఉంటాయనుకోండీ ! నారాయణ మూర్తి రిటెర్మెంట్ దగ్గర పడిన టైంలో.. రాజప్ప (రావు రమేష్) అనే ఓ మినిష్టర్ నుంచి తలనొప్పి మొదలవుతోంది. వైజాగ్‌లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్‌కు పర్మిషన్ ఇవ్వాలంటూ నారాయణ మూర్తిపై రాజప్ప ఒత్తిడి తెస్తాడు. ఇక, నిజాయితీకి మారుపేరైనా నారాయణ మూర్తి.. కాంప్లిక్స్ పర్మిషన్ ఇవ్వననడంతో.. ఇష్యూ కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఈ ఇష్యూని తెలుసుకొన్న సూరి ఏం చేశాడు.. ? గజ (మురళి శర్మ) ఎవరు? కథలో భానుమతి (రాశి ఖన్నా) ఎవరు.. ?? ఆమె ప్రేమని సూరి ఎలా దక్కించుకొన్నాడు.. ??? అన్నది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
* రామ్
* కామెడీ
* ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్ :
* సెకాండాఫ్
* పాటలు
* రొటీన్ స్టోరి

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
‘కందిరీగ’ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఓ ఊపు క్రియేట్ అయ్యింది. మరోసారి రామ్ లో హై.. పవర్ ని చూడొచ్చని ఆశపడ్డారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కూడా అదే చేశాడు. రామ్ కోసం హుషారైన కథని రెడీ చేశాడు. కథలో కావాల్సినంత ఎనర్జిని ప్రదర్శించే స్కోప్ ఇచ్చాడు. అంతేకాదు.. ఎక్కడా బోర్ రాకుండా కథలోనే అంతర్లీనంగా కామెడీని పండించాడు. ఇంకేముంది రామ్ కూడా రెచ్చిపోయాడు. ఎనర్జిటిక్ పంచ్ డైలాగ్ లో ఆకట్టుకొన్నాడు. ఇక, ‘కందిరీగ’ రిజల్ట్ రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే.. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రొటీన్ ఫార్ములా కథని చూపించేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అయినా ఫర్వాలేదు ఎక్కడా బోర్ కొట్టకుండా తీశాడని చెప్పుకొంటున్నారు.

ఇక, హీరో రామ్ ఇరగదీశాడు. ఎనర్జ్టిటిక్ నటనతో ఆకట్టుకొన్నాడు. కామెడీ, యాక్షన్, డ్యాన్స్.. ఎక్కడా తగ్గకుండా రామ్ సినిమాను తన భుజాలపై  నడిపించాడు. హీరోయిన్ రాశిఖన్నా నటనకి స్కోప్ లేదు. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. కాసేపైనా అందాలతో కనువిందు చేసింది. కాకపోతే.. సెకాంఢాఫ్ లో రాశీ పాత్ర పూర్తగా కనిపించకుండా పోవడంతో గ్లామర్ మిస్ అయినట్టు అనిపించింది.ఈ సినిమాకు  రావు రమేష్‌ను మరో ప్రధాన బలం. కామెడీ పండిస్తూనే విలనీజాన్ని చూపించాడు. సత్యరాజ్, మురళి శర్మ తమ తమ పాత్రల మేరకు బాగానే చేశారు.

సాంకేతిక విభాగం :
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకొన్నాడు. ఇదే టైంలో ప్రేక్షకుడి ఎంటర్ టైన్ చేసే అంశాలని పక్కగా రాసుకొన్నాడు. ఫస్టాఫ్ అంతా కామెడీతో నడిపించేసి.. సెకాండాఫ్ తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ని పండించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ సినిమాలో లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకొనేలా లేదు. పైగా హీరోయిన్ సెకాండాఫ్ అంతా ఎక్కడి వెళుతుందో తెలీదు. ఇక, సెకాండాఫ్ లో సమయం-సందర్భం లేకుండా వచ్చే పాటలు చిరాకుని తెప్పిస్తాయి. మొత్తంగా.. కొన్ని మైనస్ లని వదిలేస్తే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పాస్ మార్కులు తెచ్చుకొన్నాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నేపథ్య సంగీతం మణిశర్మ నుంచి ఎక్స్ పెక్ట్ చేసేంత రేంజ్ లో లేదు. జిబ్రాన్ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఒకట్రెండు పాటలు చూడ్డానికి కూడా బాగున్నాయ్. ఎడిటింగ్ ఓకే. సినిమా రిచ్ గా ఉంది.. 14 రీల్స్ నిర్మాణ విలువలకు తెరపై కనిపిస్తున్నాయి.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
కొత్తదనం, పాతదనం.. లాజిక్కులు, మేజిక్కులు అంటూ లెక్కలు వేసుకోకుండా ఓ గంటన్నర పాటు హాయిగా గడిచిపోవాలనుకునేవారు ‘హైపర్’ ని త్వరగా చూసెయొచ్చు. కాదు.. కూడదు.. కొత్తదనం.. అద్భుతాలు కావాలనుకునేవారు దసరా సీజన్ లో ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. కాస్త ఓపిక పట్టవచ్చు. మొత్తానికి.. రామ్ హైపర్ లో పవర్ ఉంది. అది ప్రేక్షకులని కూడా ఓ మోస్తారుగా మెప్పించే ఉంటుంది.

బాటమ్ లైన్ : హైపర్ లో ‘పవర్’ ఉంది.. కాస్త గ్లామర్ మిస్సయింది !
రేటింగ్ : 3/5

Leave a Reply