పూరీ డైరెక్షన్ లో అడుగులు వేయనున్న రామ్?

0
511
ram in puri direction

Posted [relativedate]

ram in puri directionనేను శైలజ, హైపర్ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న రామ్… తన నెక్స్ట్ సినిమాను అనీల్ రావిపూడితో చేయనున్నట్లు సినీ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. అయితే ఆ సినిమాలో తనది గుడ్డివాడి పాత్ర కావడంతో రిస్క్ వద్దనుకున్న రామ్.. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ని చేయడానికి ఇష్టపడుతున్నాడట. ఈ క్రమంలో తిరుమలకిశోర్ పేరు వినిపించినా ఇప్పుడు తాజాగా పూరీ పేరు తెరమీదకొచ్చింది.

ఇజం సినిమా తర్వాత కాస్త వెనకబడ్డ పూరీ కూడా రామ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే పూరీ చెప్పిన కథకు రామ్‌ ఓకే చెప్పినట్లు, ఈ మూవీ కోసం స్టుపిడ్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చెయ్యకతప్పదు.

Leave a Reply