త్వరలో  రామ్ కొత్త చిత్రం..

Posted March 18, 2017

ram kishore tirumala new movie detailsరెడీ సినిమా తర్వాత సరైన హిట్ లేని రామ్ కి గత సంవత్సరం నేను శైలజ సినిమాతో భారీ విజయాన్ని అందించాడు కిషోర్ తిరుమల. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో కిషోర్ తిరుమల ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పలువురు హీరోలు ఆఫర్లు ఇచ్చినా కిషోర్ తిరుమల మాత్రం తనకు అవకాశం ఇచ్చిన రామ్ తోనే రెండో  సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే పలు కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతుండడంతో ఈ హిట్ కాంబో సినిమా అటకెక్కేసిందని అందరూ అనుకున్నారు. అయితే వారి ఆలోచనలకు చెక్ పెడుతూ రామ్.. సినిమాకు సంబంధించిన ప్రకటనని చేసేశాడు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 25 నుండి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ప్రకటించారు దర్శకనిర్మాతలు.  నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన  కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రంలో కూడా రామ్ ని స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నాడట. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌ గా న‌టిస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి.

SHARE