ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన రామ్…

0
663

  ram meet jeneelia home

ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం హైపర్ మూవీ షూటింగ్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఈ సినిమాని సెప్టెంబర్ చివర్లో రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం లక్ష్యం. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంకోసం ‘రెడీ’ స్టార్ చాలానే కష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలోనే ముంబై వెళ్లిన రామ్ తన బెస్ట్ ఫ్రెండ్.. మాజీ హీరోయిన్ జెనీలియా ఫ్యామిలీతో కొంత సమయం గడిపాడు.

‘రెడీ’ సినిమాతోనే రామ్-జెన్నీల మధ్య మంచి స్నేహం కుదిరింది. ముంబైలో జెనీలియాతో పాటూ ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్‌, పిల్లలతో కాసేపు గడిపి ఫొటోలు తీసుకున్నాడు. ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రామ్ జెన్నీ-రితేష్‌లను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక వారి చిన్నబ్బాయి రియాన్‌తో ప్రేమలో పడిపోయానంటూ ట్వీట్ చేశాడు.

Leave a Reply