రామ్ కొత్త సినిమా.. సస్పెన్స్!

0
481

Posted [relativedate]

 ram new movie director suspense

ఈ యేడాది దసరా సీజన్ ని ఎనర్జిటి హీరో రామ్ మొదలెట్టాడు. గత శుక్రవారం “హైపర్”తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హై రేంజ్ లో కాకపోయిన ‘హైపర్ ‘ ఓ
మాదిరిగా ప్రేక్షకులని మెప్పించింది. అయితే, ‘నేను శైలజ’తో మారాడనుకొన్న రామ్.. మళ్లీ పాతదారిలోకి వచ్చాడనే కామెంట్లు వినబడ్డాయి. ఈ కామెంట్లు
రామ్ చెవి వరకు చేరినట్టున్నాయ్. దీంతో.. రామ్ మళ్లీ ట్రాక్ మార్చబోతున్నట్టు సమాచారమ్.

‘హైపర్’ తర్వాత రామ్ ‘పటాస్’ ఫేం అనిల్ రాఘవపూడితో ఓ చిత్రాన్ని చేయాల్సింది. ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్. అయితే, ఈలోపు ‘హైపర్’ విషయంలో
వచ్చిన కామెంట్స్ ని గమనించిన రామ్.. మళ్లీ ‘నేను శైలజ’ తరహా ఓ మంచి లవ్ స్టోరీని చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతానికి అనిల్ రాఘవపూడి చిత్రాన్ని ప్రక్కన పెట్టాడు రామ్. ప్రేమ కథలు వినడంలో బిజీ అయిపోయాడు. దీంతో.. రామ్ నెక్ట్స్ సినిమా ఏంటన్నదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.

Leave a Reply