రామ్ ఆ తప్పు చేస్తాడా..!

Posted November 7, 2016

rm1716ఇజం ఫ్లాప్ తో స్టార్ హీరోల అవకాశాలెలాగు రావనుకున్నాడో ఏమో ప్రస్తుత్మ బ్యాంకాక్ లో కుర్ర హీరోల కోసం కథ సిద్ధం చేస్తున్నాడట డైరక్టర్ పూరి జగన్నాథ్. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం పూరి రాసే కథ రామ్ హీరోగా చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అసలైతే ఇజం హిట్ అయితే మహేష్, ఎన్టీఆర్ లతో చేయాల్సిన పూరి ఆ సినిమా రిజల్ట్ తో వారికి దూరమయ్యాడు.

ఇక ప్రస్తుతం రామ్ కూడా పూరితో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అన్ని కుదిరితే ఈ ఇయర్ చివరనే ఈ సినిమాకు ముహుర్తం పెట్టేస్తారని అంటున్నారు. ఎన్ని ఫ్లాపులొచ్చినా పూరి సినిమా అనగానే ఓ చిన్న కాన్సెంట్రేషన్ ఏర్పడుతుంది. అంచనాలేవి లేకుండా సంచలనం సృష్టించగల పూరి ఈ మధ్య పూర్తిగా ట్రాక్ తప్పాడని అనిపిస్తుంది. మరి పూరితో రామ్ మూవీ అంటే రిస్క్ చేస్తున్నట్టే లెక్క.. ఇక తన తర్వాత సినిమాలనున్డైనా పూరి తన రియల్ టాలెంట్ బయట పెడతాడేమో చూడాలి.

SHARE