రంభ సంసారం కోర్టుకెక్కింది..

 Posted October 26, 2016

rambha moves to court to save her marriageరంభ.. గుర్తుందా.. ? అప్పట్లో ఈ సినియర్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవితో సహా.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో ఆడిపాడింది. అంతేకాదు.. యంగ్ హీరోలు తారక్, బన్నీలతో కలసి స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులు కూడా వేసింది.నిండైన అందాల రంభ అంటే ప్రేక్షకులు పడి చచ్చేవారు.2010 ఏప్రిల్ లో శ్రీలంకకు చెందిన ఇందిరన్ పద్మనాథన్ ను రంభ వివాహం చేసుకుంది. భ‌ర్త‌ కెనడాలో సెటిలైన బిజినెస్ మేన్.

కొన్నాళ్ల పాటు రంభ సంసార జీవితం సాఫీగానే సాగింది. ఆమెకి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే, కొన్నాళ్లుగా రంభ సంసారంలో గొడవలు తలెత్తినట్టు సమాచారమ్.కొన్ని నెలలుగా భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.ఇందుకు కారణాలేంటీ..?వీరు విడిపోవడానికి కారకులు ఎవరు.. ?? అనే విషయాలు తెలియవు.

అయితే,తాజాగా రంభ తన వివాహబంధాన్ని నిలబెట్టాలని కోరుతూ కోర్టు మెట్లెక్కింది.హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 9 ప్రకారం తాను భర్తతో నివసించేలా చేయమని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించింది.రంభ కేసు డిసెంబర్ 3న విచారణకు రానుంది. మరి.. రంభ సంసారం నిలబడుతుందా..?లేదా..? అన్నది చూడాలి.

SHARE