ఆ హీరోలకి చరణ్,అఖిల్ పెళ్లిపెద్దలా…?

ramcharn-and-akkineni-akhilమెగా పవర్ స్టార్ రామ్ చరణ్,అక్కినేని వారసుడు అఖిల్ వయసు రీత్యా చిన్నోళ్లే అయినా ఇద్దరు హీరోలకి మాత్రం పెళ్లి పెద్దలైనట్టు ఫిలిం నగర్ టాక్.ఇందులో నిజానిజాలేమిటో గానీ ప్రస్తుతానికి వినిపిస్తున్న దాన్ని బట్టి ఈ ఇద్దరు చెరో హీరో ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి దాకా తీసుకెళ్తున్నారట.
రామ్ చరణ్,శర్వానంద్ కలిసి చదువుకున్న విషయం అందరికీ తెలిసిందే…రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన ఓ అమ్మాయితో శర్వానంద్ ప్రేమలో పడ్డారంట.విషయం తెలిసిన చరణ్ రెండు కుటుంబాల మధ్య వారధిగా నిలబడి ఆ ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది.అదే జరిగితే ఇప్పటిదాకా స్నేహితులైన చరణ్,శర్వానంద్ తోడల్లుళ్లు అవుతారంట.
అక్కినేని బుల్లోడు అఖిల్ కూడా ఇలాంటి పెద్దరికమే వహించి సాటి కథానాయకుడు,తొలి చిత్ర నిర్మాత నితిన్ పెళ్లి కుదిర్చినట్టు సమాచారం.అఖిల్ కాబోయే భార్య శ్రేయ భూపాల్ స్నేహితురాలితో నితిన్ లవ్ బాండ్ ని పెళ్ళిపీటల దాకా తీసుకెళ్లడంలో అఖిల్ దే ప్రధాన పాత్రగా తెలుస్తోంది.ఈ రెండు పెళ్ళిళకి సంబంధించి అధికారిక సమాచారం త్వరలో బయటికి రానుంది.

SHARE