మాయావతి మీద రాఖీసావంత్ పోటీ ..

Posted November 14, 2016

Ramdas Athawale said Rakhi Sawant against mayawati
యూపీ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది.నేతలంతా టిక్కెట్ల కోసం పార్టీ హైకమాండ్ చుట్టూ తిరుగుతుంటే సెక్సీ సుందరిగా పేరుపడ్డ రాఖీ సావంత్ దగ్గరికి ఆమె అడక్కుండానే టికెట్ నడుచుకుంటూనే వచ్చింది.పైగా ఆమెకి యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మీద పోటీ చేసే అవకాశం కల్పిస్తానంటోంది ఆ పార్టీ. రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా అధినేత రామదాస్ అదవాలే ఈ ప్రకటన చేయడం అటు రాజకీయ వర్గాల్లో..ఇటు ప్రజల్లో కుతూహలం రేకెత్తిస్తోంది.

రామదాస్ మరికొన్ని అంశాలపై కూడా ఆసక్తి రేపే విషయాలు చెప్పారు.rpi కి దళితుల మద్దతు మెండుగా ఉన్నప్పటికీ బీజేపీ తో పొత్తు పెట్టుకుంటామని అయన తెలిపారు.ఒక వేళ కుదరకపోతే 200 స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తామని రాందాస్ ప్రకటించారు.మోడీని ఆరాధించే రాఖీ సావంత్ ని మాయావతి మీద పోటీ చేయించాలన్న ఆలోచన ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకి మాత్రం అయన నేరుగా సమాధానమివ్వలేదు.

SHARE