Posted [relativedate]
జిమ్ లో కష్టపడే యువతను యోగా వైపు మళ్లించిన ఘనత బాబా రాందేవ్ దే. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది ఆయన వల్లేనని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతేకాదు పతంజలి ప్రొడక్టుల ద్వారా కూడా ఆయన మార్కెట్ లో దూసుకుపోతున్నారు. అలాంటి రాందేవ్ బాబా దిగంబరుడిగా మారితే ఎలా ఉంటుంది? ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? అయితే స్టోరీ మొత్తం వినాల్సిందే.
ఇటీవల మైసూర్ జిల్లా సుతూర్తు మఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాందేవ్ బాబా పాల్గొన్నారు. యోగా గురించి ప్రజలకు వివరించారు. అనంతరం సాధువుల టాపిక్ వచ్చింది. సాధువులు లోక సంక్షేమం కోసం పాటుపడతారన్న ఆయన.. తాను కూడా అదే దిశలో పనిచేస్తున్నానని ప్రకటించారు. ప్రజల ముందు సంస్కారం కోసమే తాను బట్టలు ధరిస్తున్నానని.. లేకపోతే దిగంబరంగానే ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.
మనదేశంలో దిగంబర సాధవులు చాలామందే ఉన్నారు. అందులో వింతేం లేదు. కానీ రాందేవ్ బాబా నోట దిగంబర మాట రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో ఆయన దిగంబరుడిగానే దర్శనమిస్తారా అన్న చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పట్నుంచే జనానికి చిన్న హింట్ ఇచ్చారని టాక్.
ఏదేమైనా రాందేవ్ బాబా దిగంబరుడిగా మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాబా సన్నిహితులు చెబుతున్న ప్రకారం …. ఆయన త్వరలోనే దిగంబరుడిగా మారతారట. దానికి ఎంతో కాలం పట్టలేదు. బహుశా వచ్చే నాలుగైదు ఏళ్లలోపే అది జరగనుందని టాక్. అంతేకాదు దిగంబరుడిగా మారితే రాందేవ్ బాబా ఎవరికీ కనిపించరట. బహుశా ఆయన హిమాలయాలు లేదా ఇతర పర్వతప్రాంతాల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకొని.. అక్కడే తపస్సులోకి వెళ్లిపోతారని సమాచారం. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాందేవ్ బాబా అభిమానులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ గా మిగిలిపోతుంది.