ఆ హీరో చెవిలో మొగలిపువ్వెట్టిన వర్మ..

0
425
ramgopal varma gave hand to sachinjoshi

Posted [relativedate]

ramgopal varma gave hand to sachinjoshi
ఒక్క సారి వర్మ చేతిలో పడితే తమ జాతకం మారిపోతుందని ఎంతోమంది అప్ కింగ్ హీరోలు, హీరోయిన్స్,ఆర్టిస్ట్స్ అనుకుంటారు.చాలా మంది విషయంలో అది నిజం కాదని తెలిసినా సినిమాల్లో వెలిగిపోవాలన్న ఆశ తో వర్మ వైపు చూసే వాళ్ళ సంఖ్య కాస్త తగ్గినా అసలుకైతే జనం లేకుండా లేరు.

అలా ఆశించినవాడే వెండితెర మీద ఘజని లా పదేపదే దాడులు చేస్తున్న సచిన్ జోషి.వెనుక కుప్పలు తెప్పలుగా డబ్బు,వ్యాపార సామ్రాజ్యం వున్నా ఈయనగారికి హీరోగా వెలిగిపోవాలన్న కోరిక తీరలేదు.అందుకే అలుపు లేకుండా ఆ డబ్బు ఎర వేసి హిందీ,తెలుగు సినీ రంగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే వున్నాడు.
ఒకప్పుడు అలా సచిన్ చేసిన ఓ గట్టి ప్రయత్నంతో మొగలిపువ్వు అని ఓ రొమాన్స్,ఫ్యామిలీ డ్రామా తో కూడిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అంటూ ఓ సినిమా తీసాడు రామ్ గోపాల్ వర్మ.ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.కానీ ఏమి జరిగిందో కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు సరికదా వర్మకి కనీసం తాను ఆ సినిమా తీసిన విషయం గుర్తున్నట్టు కూడా లేదు.ఆ సినిమా రిలీజ్ అయితే హీరోగా తన ఫేట్ మారిపోతుందని ఆశగా ఎదురు చూస్తున్న సచిన్ జోషి చేతిలో వర్మ మొగలిపువ్వెట్టేసి వెళ్ళిపోయాడు.

Leave a Reply