ఎన్టీఆర్ ని ఢీకొట్టిన రామ్మోహన్.

496
rammohan-struck-ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంత మంచిగా ప్రసంగాలు చేస్తారో అందరికీ తెలుసు. చిన్న వయసులోనే పార్లమెంట్ లోను మంచి వాగ్ధాటితో జాతీయనేతల్ని ఆకట్టుకున్నాడు రామ్మోహన్. ఇక ఆ ప్రతిభ చూసే టీడీపీ అధినేత చంద్రబాబు తన మిత్రుడు ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడుని చూసి మురిసిపోతుంటారు. ఇటీవల విశాఖ మహానాడులో ప్రత్యేకంగా ఇదే విషయాన్ని ప్రస్తావించి మరీ పొగిడారు బాబు. డైలాగు ల్లో అలా నేషనల్ లెవెల్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రామ్మోహన్ ఇప్పుడు స్టెప్స్ మీద పడ్డాడు. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నే ఢీకొడుతూ ఆయన పాటకి అదిరిపోయే రేంజ్ లో డాన్స్ చేసాడు. ఓ ఎంపీ ఎన్టీఆర్ పాటకి డాన్స్ చేయడం ఏంటనేగా మీ డౌట్ ?

రామ్మోహన్ నాయుడు పెళ్లి రేపు విశాఖలో జరగనున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తెను వివాహం చేసుకోబోతున్న సంగతి కూడా బాగా ప్రచారం అయ్యింది . ఆ పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ కోసం బాద్షా లోని బంతిపూల జానకి పాటకి రామ్మోహన్ డాన్స్ చేసాడు. ఆ వీడియో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here