Posted [relativedate]
మీడియా మొఘల్ రామోజీరావు ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి.ఆయన పెద్ద కుమారుడు కిరణ్,శైలజ దంపతుల కుమార్తె సహరి పెళ్లి కుదిరింది.ఏప్రిల్ 7 న రామోజీ ఫిలిం సిటీ లో ఘనంగా నిశ్చితార్ధం కూడా జరిగింది.జూన్ 28 న సహరి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. రామోజీ ఇంటి అల్లుడు అయ్యే అదృష్టం ఎవరికి దక్కిందో తెలుసుకోవాలనుందా.?
భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ యెల్లా..సుచిత్ర యెల్లా దంపతుల కుమారుడు రాచెస్ వీరేంద్ర దేవ్ కాబోయే పెళ్ళికొడుకు.జికా వైరస్ కి మొదటిసారిగా మందు కనిపెట్టిన ఘనత సొంతం చేసుకున్న భారత్ బయోటెక్ వ్యవహారాలు చూసుకుంటున్న సుచిత్ర యెల్లా,మార్గదర్శి వ్యవహారాలు చూసుకుంటున్న శైలజ ఇద్దరూ మంచి స్నేహితులు.ఆ స్నేహాన్ని బంధుత్వం దాకా తీసుకెళితే బాగుంటుందని రెండు వైపులా వచ్చిన ఆలోచనతో ఈ పెళ్ళికి శ్రీకారం చుట్టారు.